Sunday, February 28, 2016

' సాంప్రదాయాలు పాటించాలి' : వివేకానంద ఆవాస విద్యాలయ వార్షికోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ-రామాయంపేట
 విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ క్షేత్ర ప్రచారక్‌ ఏలే శ్యాంజీ అన్నారు. పట్టణంలోని వివేకానంద ఆవాస విద్యాలయ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ఉన్నవారు మంచిని పెంచి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే 64 కలలు నేర్చుకోవాలన్నారు. రామాయంపేట మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు చదివే వివేకానంద ఆవాసం ఆర్థికంగా ఉంటేనే నడుస్తుందని, కార్పస్‌ నిధి కింద తన వంతుగా రూ.లక్ష విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. పెద్దిరెడ్డి క్రిష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, నవాత్‌ సురేష్‌ పాల్గొన్నారు.

Source: http://www.navatelangana.com/article/medak/235797

No comments:

Post a Comment